


Diet & Nutrition
15 December 2025 న నవీకరించబడింది
ప్రెగ్నెన్సీ సమయంలో సాబుదాన తల్లి మరియు బిడ్డకు అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని మీకు తెలుసా? ప్రెగ్నెన్సీ అనేది స్త్రీలు కేవలం తమ జీవితానికి మాత్రమే కాకుండా పుట్టబోయే బిడ్డ జీవితానికి కూడా బాధ్యత వహించాల్సిన సమయం. చిన్నప్పుడు మన తల్లులు తీసుకున్న జాగ్రత్తల వల్ల మనమంతా ఇప్పటికీ బాగున్నాం. కేవలం ప్రెగ్నెన్సీ సమయంలోనే కాకుండా పోస్ట్ ప్రెగ్నెన్సీ (డెలివరీ తర్వాత) సమయంలో కూడా తల్లులు వారు తీసుకునే ఆహారం మీద దృష్టిపెట్టాలి మరియు ఆ సమయంలో తల్లులు చనుబాలిస్తారు కాబట్టి వారు మరింత పోషకాహారం తీసుకోవాలి. శిశువు ఫుడ్ మరియు అన్ని రకాల విటమిన్ల కోసం తన తల్లి మీద ఆధారపడుతుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు డెలివరీ తర్వాత కూడా హెల్దీ మరియు అనేక పోషకాలు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి. సగూ ఎందుకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహారపదార్థం, ప్రెగ్నెన్సీ సమయంలో దీనిని తినాలా, వద్దా అనేది ఇప్పుడు చూద్దాం.
సాబుదానను సకాక్, సాహు లేదా రబియా అని ఉష్ణమండల దేశాల్లో పిలుస్తారు. ఆసియా దేశాలలో ఇది చాలా ఫేమస్. సాబుదాన లేదా సగూ అనేది ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహారం. ఇది తినదగిన పిండిపదార్థం. బియ్యం వంటి పిండిపదార్థాలకు ఇది ప్రత్యామ్నాయంగా ఉంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సాబుదానను వివిధ వెరైటీల్లో తినొచ్చు. దీనిని స్నాక్‌గా మెయిన్ కోర్స్‌గా లేదా డెసర్ట్‌గా తినేందుకు వీలుంటుంది. టాపియోకాని సగూ అని చాలామంది తికమక పడుతుంటారు. కానీ అవి రెండు వేర్వేరు పదార్థాలు. సగూ ఉష్ణమండల ప్రాంతాల్లో లభిస్తుంది. ఇది తాటిచెట్ల నుంచి తయారవుతుంది. ఇది తినదగిన పిండిపదార్థం. టాపియోకా అనే పిండి పదార్థం కాస్సావా అనే మూలాల నుంచి తయారైంది. టాపియోకాను ప్రధానంగా భారతీయ వంటకాలలో ఉపయోగిస్తారు. సాబుదానతో మీరు అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేయొచ్చు. అందువల్లే సాబుదానను బహుముఖ ప్రజ్ఞశాలి అని అంటారు. దీనిని వండడం చాలా తేలిక. దీని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఎముకల అభివృద్ధి (ఎముకల బలం, ఎముకల సాంద్రత) కండరాల పెరుగుదల, రోగనిరోధక శక్తి పెరుగుదల, తగినంత శక్తిని అందించడం వంటి లక్షణాలను కలిగి ఉన్నందువల్ల పిల్లలు సాబుదాన వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.
అన్నింటికంటే ముఖ్యమైనది మీరు పోషకాలతో కూడిన డైట్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. ఇది మీ శిశువు ఆరోగ్యానికి సురక్షితం. సాబుదాన (సగూ) అనేది ఒక ఉత్తమ ఆహార పదార్థం. ఇది హెల్దీ పిండిపదార్థంగా పిలవబడుతుంది. పిండిపదార్థాలు నిల్వ చేయబడిన శక్తిని మాత్రమే అందజేస్తాయి. కానీ సాబుదాన మాత్రం కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి విటమిన్లను కూడా అందజేస్తుంది. ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్‌ను కూడా మీరు పొందుతారు.
మీరు మీ ఆహారంలో సగోను చేర్చితే మీరు దానిని మైదా లేదా ఆల్పర్పస్ వంటి పిండితో భర్తీ చేయొచ్చు మరియు అనేక రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. సాబుదానా తో చేసిన వంటకాలు త్వరగా జీర్ణం అయిపోతాయి.. సాబుదాన మీకు రెండు రూపాల్లో లభిస్తుంది. ఒకటి పొడి మరియు ముత్యాలు (సాబుదాన గింజలు ముత్యాల్లా ఉంటాయి) ఈ రెండు రకాలతో మీరు కావాల్సిన వంటకాలను చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ డయాబెటిస్ ఉన్న స్త్రీలు సగూలను తినకూడదు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కేలరీలను పెంచి మీ బరువు పెరిగేలా చేస్తాయి. మీరు అంతగా తినాలని అనుకుంటే వాటి వాడకాన్ని పరిమితం చేయాలి. సాబుదానను యోగా మరియు వ్యాయామంతో కలిపి తీసుకోవాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో వేరుశనగ: సురక్షితమా, కాదా ?
ప్రజలు సాధారణంగా ఉపవాసం ఉన్న సమయాల్లో ఈ సాబుదానను తింటారు. గోధుమలు మరియు గోధుమ ఉత్పత్తులకు ఇది మంచి ప్రత్యామ్నాయం. మీరు ఆకలితో ఉన్నపుడు ఇది తింటే బాగుంటుంది. సగూ లేదా సాబుదానలో కింది మూలకాలు సమృద్ధిగా ఉంటాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి?
ఇక్కడ మేము సాబుదాన లేదా సగో యొక్క ప్రతి అంశాన్ని వివరించాం. వీటిని తీసుకోవడం చాలా ఉత్తమం మరియు సురక్షితం. ఈ ఆహారం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఎంత తింటున్నారో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. మీరు సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కిరాణా మార్కెట్లలో లభించే సాబుదానను మీరు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే వారు ప్రాసెస్ చేసిన సగోని విక్రయిస్తారు. ప్రాసెస్ చేయని సాబుదాన లేదా సగో చాలా ప్రమాదకరమైనది, విషపూరితమైనది. మీకు కొన్ని అరుదైన సందర్భాల్లో లివర్ డ్యామేజ్, వాంతులు, మరణాలు కూడా సంభవించొచ్చు.
మేము ఇక్కడ మీకు చివరగా చెప్పొచ్చేదేంటంటే మీరు సాబుదానను మార్కెట్ల నుంచి కొనుగోలు చేసి వండి తినడం ఉత్తమం మరియు సురక్షితం. సాబుదాన వలన అంతులేని ప్రయోజనాలు ఉన్నాయి. మీ శిశువు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి.
Tags:
Sabudana during pregnancy in telugu, Can pregnants eat Sabudana in telugu, Benefits of eating Sabudana during pregnancy in telugu, Sabudana nutritional value in telugu, sabudana recipes for pregnants in telugu
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips


గర్భధారణ సమయంలో దానిమ్మ తినవచ్చా? దీని వలన కలిగే ఫలితాలు ఏమిటి? (Pomegranate During Pregnancy : Benefits in Telugu)

గర్భంలో ఉన్న బిడ్డ జనన అవయవాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? (When Do Sex Organs Develop During Pregnancy in Telugu?)

గర్భాశయ పరిపక్వత (సర్వికల్ రైపెనింగ్): విషయం, పద్ధతులు, లాభాలు & అపాయాలు (Cervical Ripening: Concept, Methods, Benefits & Threats in Telugu)

ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ మరియు మీ పీరియడ్స్ మధ్య తేడాను కనుగొనడం ఎలా ? | How to Differentiate Between Implantation Bleeding and Your Periods in Telugu

మీ బేబీ కి వింటర్ ఫ్యాషన్ కోసం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు!

వెసెక్టమీ రివర్సల్ అంటే ఏమిటి? దీని వలన ఉపయోగాలు ఏమిటి? ఇది చేయడం వలన ఎదురయ్యే రిస్క్స్ ఎలా ఉంటాయి?

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |